#687లేచినాడూరా - సమాధి గెలిచినాడూరా - యేసు ల
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
లేతునని తా చెప్పినట్లు – లేఖనములలో పలికినట్లు ||లేచినా||
1.
భద్రముగా సమాధిపై – పెద్దరాయిని ఉంచి భటులు
ముద్రవేసి రాత్రియంత నిద్రలేక కావలియున్న ||లేచినా||
2.
ప్రభువు దూత పరమునుండి – త్వరగా దిగి రాయిని దొర్లించి
భీకర
దానిపై కూర్చుండె – భయము నొంద కావలివారు ||లేచినా||
3.
ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన
సుగంధములు శ్రద్ధతోడ తెచ్చి యేసుకు – రుద్దుదామని వచ్చి చూడ ||లేచినా||
4.
చూడవెళ్ళిన స్త్రీలను దూత – చూచి అప్పుడే వారితోడ
లేడు గలిలయ ముందరగా పోతున్నాడు – అప్పుడే లేచినాడని ||లేచినా||
5.
చచ్చిపోయి లేచినాడు – స్వామి భక్తులకు కనబడినవాడు
చచ్చినను నన్ను లేపుతాడు – చావు అంటే భయపడరాదు ||లేచినా||
6.
నేను చేసే పనులనెరుగు – నేను నడిచే
మార్గమెరుగు నేను
చెప్పే మాటలెరుగు – నేను బ్రతికే బ్రతుకునెరుగు ||లేచినా||
7.
నేను లేచిన యేసునందు – మానక మదినమ్మి
యుందు – తాను నాలో ఉన్నందున – దయను చేర్చును మోక్షమందు ||లేచినా||
8.
పాపభారము లేదు మనకు మరణభయము
లేదు మనకు నరకబాధ లేదు మనకు – మరువకండి యేసుప్రభుని ||లేచినా||
9.
యేసునందే రక్షణ భాగ్యం – యేసునందే నిత్యజీవం
యేసునందే ఆత్మశాంతి – యేసునందే మోక్షభాగ్యం ||లేచినా||
10.
పాపులకై వచ్చినాడు – పాపులను కరుణించాడు
పాపులను ప్రేమించినాడు – ప్రాణదానము చేసినాడు ||లేచినా||