FaithWalk
← Back to Library

#686రేయింబగలు నీ పదసేవే - యేసు ప్రభువా - చేయ

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
రేయింబగలు నీ పదసేవే – యేసు ప్రభువా – చేయుట మేలు సాటిలేని దేవుడవు నీవే – నాదు కోట కొండయు నీవే
1.
పరమపురిలో వరదా నిరతం – దూతగణముల స్తుతులను సల్పి శుద్ధుడు పరిశుద్ధుడనుచు – పూజనొందే దేవుడవు నీవే ||రేయిం||
2.
జిగటమన్నే మానవులంతా – పరమ కుమ్మరి ప్రభుడవు నీవే సృష్టికర్తను మరచి జనులు – సృష్టిని పూజించుట తగునా ||రేయిం||
3.
పెంటకుప్పలనుండి దీనుల – పైకిలేపు ప్రభుడవు నీవే గర్వమణచి గద్దెలు దించి – ఘనులనైనా మేపవు గడ్డి ||రేయిం||
4.
నరుల నమ్ముట కంటే నిజముగా – నీదు శరణం శరణం దేవా రాజులను ధరణి నమ్ముటకంటే – రాజరాజవు నాకాశ్రయము ||రేయిం||
5.
అగ్నివాసన అంటకుండా – అబేద్నెగోలతో నుండి నదేవా – దానియేలును సింహపు బోనులో – ఆదుకొన్న నాథుడవు నీవే ||రేయిం||
6.
పరమగురుడవు ప్రభులకు ప్రభుడవు – వరము చేర్చు పదము నీవే అడుగుజాడల నడిచిన – హనోకు – పరము చేరె ప్రాణముతోడ ||రేయిం||
7.
మృతుల సహితము లేపినావు – మృతిని గెలిచి లేచినావు మృతులనెల్ల లేపువాడవు – మృత్యువును మృతిలేపినావు ||రేయిం||