FaithWalk
← Back to Library

#685రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే
1.
యేసుని పిలుపు వినియు నింక – యోచింపనేల అవనిలో అజాగ్రత్తపాలైన అబద్ధ శాంతి ఆత్మకు ఇలలో ||రండి రండి||
2.
కరువు రణము మరణము చూచి కలుగదు మారుమనస్సు ప్రవచనములు సంపూర్ణములాయెను యూదులు తిరిగి చూచుచున్నారు ||రండి రండి||
3.
ప్రభు యేసు నీ కొరకై తనదు – ప్రాణము నిచ్చెగదా సిలువను రక్తము చిందించియును – బలియాయెను యా ఘనుడు మనకై ||రండి రండి||
4.
యేసుని నామమునందే పరమ – నివాసము దొరకును ముక్తిని పాప విమోచనమును – శక్తిమంతుడు యేసే ఇచ్చును ||రండి రండి||
5.
నేనే మార్గము, నేనే సత్యము – నేనే జీవమును నేను గాక ఇంకెవరు లేరని యెంచి చెప్పిన యేసుని వద్దకు ||రండి రండి||