#684రమ్ము! నీ తరుణమిదే - పిలచుచున్నాడు నీ ప్
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
రమ్ము! నీ తరుణమిదే – పిలచుచున్నాడు
నీ ప్రభువైన – యేసు నొద్దకు
1.
జీవితమంతయు – వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుటయేల – వచ్చి ఆయన శరణు జొచ్చినచో
వాంఛతో నిన్ను – స్వీకరించును ||రమ్ము||
2.
కట్టిన ఇల్లు – ధనధాన్యములు కనబడు బంధుమిత్రులును
గూడు విడిచి – నీవు పోయినచో – వెంట నీతో రారెవరు ||రమ్ము||
3.
అందము మాయ – అస్థిరమే – దాని నమ్మకుము మోసగించును
మరణము ఒకనాడు వచ్చును మరవకుము – నీ ప్రభువును ||రమ్ము||
4.
మిన్ను క్రిందన్ – భూమి మీదన్ – మిత్రుడేసు నామము గాక
రక్షణ పొందు – దారి లేదు రక్షకుడేసే – మార్గము ||రమ్ము||
5.
తీరని పాప వ్యాధులును – మారని నీదు – బలహీనతల్ ఘోర సిలువలో – మోసి తీర్చెను – గాయములచే బాగుపడెన్ ||రమ్ము||
6.
సత్యవాక్కును నమ్మి రమ్ము – నిత్యజీవమును నీకిచ్చును నీ పేరు జీవపుస్తకమునందు నిజముగా ఈనాడే – వ్రాయును ||రమ్ము||