FaithWalk
← Back to Library

#682యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరి

Author: UnknownComposer/Ragam: చేయున్ జలరాసులనుండి బలమైన చేతితో – వెలుపలCategory: రెండవ అనుబంధము
ప
యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ||యెహోవా నా||
1.
నా శత్రువులు నన్ను చుట్టిననూ – నరకపు పాశము లరికట్టిననూ వరదవలె భక్తిహీనులు పొర్లినా – వదలకు నన్ను ఎడబాయని దేవా ||యెహోవా నా||
2.
మరణపు టురTargetములు మరవక – మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను అదిరెను ధరణి భయకంపముచే ||యెహోవా నా||
3.
నా దీపమును వెలిగించువాడు – నా చీకటిని వెలుగుగా చేర్చిన బలమైన దేవుడు ||యెహోవా నా||
4.
పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణకెను తన నోటి నుండి వచ్చిన అగ్ని – దహించి వేసెను వైరల నెల్లను ||యెహోవా నా||
5.
మేఘములపై ఆయన వచ్చును – మేఘములను తన మాటుగ చేయును ఉరుముల మెరుపుల మెెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని ||యెహోవా నా||
6.
దయగలవారిపై దయచూపించును – ఖిన్నుల యెడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము నణచును సర్వము నెరిగిన సర్వాధికారి ||యెహోవా నా||
7.
నా కాళ్ళను లేడికాళ్ళుగా చేయును – ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి – అక్షయముగా తన పక్షము చేర్చిన ||యెహోవా నా||
8.
యెహోవా జీవము గల దేవా – బహుగా స్తుతులకు అర్హుడు నీవు అన్యజనులలో ధన్యత చూపుచు – హల్లెలూయా స్తుతిగానము చేసెద ||యెహోవా నా||