FaithWalk
← Back to Library

#681మార్గము చూపుము ఇంటికి - నా తండ్రి ఇంటికి

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము – చూపించు కంటికి (2)
1.
పాప మమతల చేత పారిపోయిన నాకు – ప్రాప్తిం చె శిక్షా క్షీణము పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమగోరుచు – పంపుము క్షేమము – ప్రభు నీ సిలువముఖము చల్లిన నాకు పుట్టించె ధైర్యము
2.
ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు – తండ్రిని వీడితి ధరణీభోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయు – దేహి నినుచేరితి – దేహి అని నీవైపు చేతులెత్తిననాకు దారిని చూపుము ||మార్గము||
3.
దూరదేశములోన బాగుందు ననుకొనుచు – తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల – తరిమెను దారిద్ర్యము దాక్షిణ్యమూర్తి నీదయ నాపై కురిపించి – ధన్యుని చేయుము ||మార్గము||
4.
అమ్ముకొంటిని నేను అధముడొక్కనికి నాడు – ఆకలి బాధలో అన్యాయమైపోయె పందులు సహ వెలివేయ – అలవడెను వేదన – అడుగంటి జనియె మానవత ఆశ్రయము గూర్చుము ||మార్గము||
5.
కొడుకునే కాదనుచు గృహమే చెరసాలలను – కోపించి వెళ్ళితి – కూలివానిగనైన నీ ఇంట పనిచేసి – కనికరమే కోరుదు – కాదనకు నా తండ్రి దిక్కెవరును లేరు – క్షమియించు బ్రోవుము ||మార్గము||
6.
నా తండ్రి నన్ను గని పరుగెడుచు ఏతెంచి – నాపై బడి ఏడ్చెను నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను – నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుండును ||మార్గము||