#680మధురం మధురం మధురం - యేసునాథ కథ మధురం
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
మధురం మధురం – యేసునాథ కథ మధురం ||మధురం||
1.
మధురమే మన ప్రభు యేసుని నామం – మానవాళికదే
మాధుర్యము నామం – పాపిని బ్రోచెడి పావన నామం పరమున చేర్చే
పరిశుద్ధనామం ||మధురం||
2.
మారని దేవుని మాటయే మధురం – మదిలో దలచిన కలతను తీర్చున్ – ఎదలో బాధను బాపున్ నిరతం – నమ్మిన నరులకు నెమ్మది
ఇచ్చున్ ||మధురం||
3.
పగలు రేయి ప్రార్థించుటే మధురం పరిశుద్ధుల
సహవాసమే
మధురం – అపొస్తలుల సద్బోధయే మధురం – మధురాతి మధురం
పరిశుద్ధ రుధిరం ||మధురం||
4.
జంటితేనె ధారలకంటే – కమ్మనిది ప్రభు క్రీస్తుని
వాక్యం – ఆదియందు ఆ వాక్యమే యుండెన్ – వాక్యమే
ప్రియప్రభు యేసుగ మారెన్ ||మధురం||
5.
అందరిలో అతిసుందరుడతడు – ఆది దేవుని ఏకైక సుతుడు
ఆశ్చర్యకరుడా ఆలోచన కర్త – అవతరించె భువిన్ అందరి
కొరకే ||మధురం||
6.
యేసే క్రీస్తని యెరిగిన మేము – పరుగిడితిమి పాపము నుండి దూరం పొందితిమి ఆత్మానందభాగ్యం ప్రకటించుటే
మా
ప్రధానధేయం ||మధురం||