#679మణులు మాణిక్యములున్నా - మేడమిద్దెలు ఎన్న
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
మణులు మాణిక్యములున్నా – మేడమిద్దెలు ఎన్నున్నా
మదిలో యేసు లేకున్నా – ఏది ఉన్నా అది సున్నా ||మణులు||
1.
చదువులెన్నో చదివున్నా – పదవులెన్నో చేస్తున్నా
విద్యవున్నా బుద్ధివున్నా – జ్ఞానమున్నా అది సున్నా ||మణులు||
2.
అందచందా లెన్నున్నా – అందములపై కూర్చున్నా
సుందరుడు ప్రభులేక యున్నా – అందమున్నా అది సున్నా ||మణులు||
3.
రాజ్యములు రమణులు ఉన్నా – శౌర్యములు వీర్యములున్నా – బలము ఉన్నా – బలగమున్నా ఎన్నివున్నా
అవి సున్నా ||మణులు||
4.
పూజ్యుడా పుణ్యాత్ముండా – పుణ్యకార్య సిద్ధుడా
దానధర్మము జపము తపము – యేసులేనిది అదిసున్నా ||మణులు||