FaithWalk
← Back to Library

#66Love Divine, all love excelling

Author: చార్లెస్ వెస్లీ (అనువాదం: హెచ్. హెన్రీ డేవిడ్)Translator: హెచ్. హెన్రీ డేవిడ్)Category: సాయంతనారాధన
1.
దైవ ప్రేమ పృథివిలోని యన్నింటిని మించును యేసు మాలో నివసించు యది మా విముక్తియే నీ అమూల్య ప్రేమ యుండు నీవు దాసులమైన మమ్ము కృపతో రక్షించుము.
2.
మమ్ము సంరక్షించు శక్తి నీకుండు, మా ప్రభువా ఎన్నడెన్నడు నీదు సన్నిధిని బాయకుము నిన్ను స్తుతియించుచు మేము సర్వదా సేవింతుము నిన్ను ప్రార్థించి పూర్ణప్రేమ మేమతిశయింతుము.
3.
క్రొత్తగా మమ్ము సృజించి పాపమెల్ల బాపుము మాకు స్వస్థత నొసంగి గొప్ప రక్షణ చూపుము భక్తి యభివృద్ధి పొంది స్వర్గమందు చేరగా వింతనొంది ప్రేమ స్తుతి నీకర్పింతు మెప్పుడు.