#639ఆహా.. ఆ... అంత్యతీర్పు నందున ... యేసే నీ
Author: UnknownCategory: రెండవ అనుబంధము
1.
ఓ మానవుడా నీ గతి ఏమౌనో తెలియదా యేమేమి చేయుచుంటివో తప్పించుకొందువా?.... పల్లవి:
అహహ..ఆ...అంత్యతీర్పు నందున ...యేసూ నీ రక్షకుడే మహాభయంకరమో ...సింహంబుగా నుండు ||
2.
లోకాలు పుట్టినప్పటినుండి మృతులైన ఏ కులజుడైనా నాటికి – తీర్పులో నిలచును ||అహహ||
3.
మృతులైన ఘనులు హీనులు – యేసయ్య యెదుటను ప్రతివారు నిలిచియుందురు బ్రతికిన రీతిగానే ||అహహ||
4.
గ్రంథాలు విప్పబడగా – గ్రంథాలలో వారి గ్రంథంబు బట్టబయలై – పొందుదురు తీర్పును ||అహహ||
5.
నరులెల్ల క్రియలచొప్పున – మరి తీర్పు పొందుదురు మరణము మృతుల లోకము – గురియౌను యజ్ఞానికి ||అహహ||
6.
ఈనాడు నీవు కూడను – యేసుని విడచినచో ఆనాడు నీవు కూడాను – అందుండి ఏడ్చెదవు ||అహహ||
7.
దేవుని జీవగ్రంథము – దేవుడు తెరచును ఎవ్వాని పేరందుండదో – వాడు అగ్నిలో బడును ||అహహ||