#632ఇదియే సమయంబు రండి యేసుని చేరండి
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
ఇదియే సమయంబు రండి యేసుని జేరండి – ఇక సమయము లేదండి – రండి రక్షణ నొందండి ||
1.
పాపులనందరిని – తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణమిచ్చెనుగా మరణపు ముళ్ళను విరిచి – విజయము నిచ్చెనుగా ||ఇక||
2.
రాజుల రారాజైన యేసు రానై యుండెనుగా గుర్తులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి తరుణముండగానే – మీరు తయారవ్వండి ||ఇక||
3.
బుద్ధి లేని కన్యకలవలె – మొద్దులుగానుంటే సిద్దెలలో నూనెపోసి – సిద్ధపడకపోతే తలుపులు తట్టినను – మీకు తెరవడు సుమ్మండి ||ఇక||
4.
వెలుపటనుంటేనే మీరు వేదన నొందెదరు – తలుపులు తట్టినను – మీకు తెరవడు సుమ్మండి మిమ్మును ఎరుగను – మీరెవరో పొమ్మనును ||ఇక||
5.
సందియ పడకండి – మీరు సాకులు చెప్పకను గుర్తులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి మరణ దినమూ మన – మెరుగము సుమ్మండి ||ఇక||
6.
సందియ పడకండి – మీరు సాకులు చెప్పకను గుర్తులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి మరణ దినమునూ మన – మెరుగము సుమ్మండి ||ఇక||
7.
జాలము చేయకను – మీరు హేళన చేయకను కులము స్థలమనుచూ – మీరు కాలము గడపకనూ తరుణముండగానే – మీరు త్వరపడి రారండి ||ఇక||