FaithWalk
← Back to Library

#631ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
ఇదిగో నీ రాజు వచ్చుచుండె – సీయోను కుమారి సంతోషించు – యెరూషలేము కుమారి ఉల్లసించు ||
1.
నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే పాపరహితుడు ప్రభు – వచ్చు చుండె ||ఇదిగో||
2.
రక్షణగలవాడుగా – అక్షయుండగు యేసుడు ఇచ్చోటడ యెరూషలేము – వచ్చు చుండె ||ఇదిగో||
3.
సాత్వికుండు ఈ భువిన్ – అత్యంతమగు ప్రేమతో నిత్యరాజు నరులకై – వచ్చుచుండె ||ఇదిగో||
4.
దీనవరుడు నీ ప్రభు – ఘనత కలిగిన దేవుడు ప్రాణమీయ పాపులకై – వచ్చుచుండె ||ఇదిగో||
5.
ఇలను గాడిద నెక్కియే – బాలల స్తోత్రములతో బలుడగు నీ प्रभु – వచ్చుచుండె ||ఇదిగో||
6.
దావీదు కుమారుడు – దేవుడు పాపులకు జయ గీతములతో – వచ్చుచుండె ||ఇదిగో||
7.
యేసుని ప్రేమించుచు హోసన్నా పాడెదము యేసుడిల వచ్చుచుండె – హల్లెలూయ ||ఇదిగో||