#614ముగింపు పాట
Author: పులిపాక జగన్నాథముComposer/Ragam: శ్రీరాగముCategory: క్రైస్తవ కుటుంబము
ప
పంపుము దేవా – దీవెనలతోను – పంపుము దేవా పంపుము దయచేతను – పతిత పావన నామ – పెంపుగ నీ సేవ – ప్రియమొప్ప నొనరింప || పంపుము ||
1.
మా సేవ నుండిన – మా వెలు తులన్నియు యేసుని కొరకు నీ – వెసగ క్షమియించుచు || పంపుము ||
2.
వినిన సత్యంబును – విమలాత్మ మది నిల్పి – దినదినము ఫలములు – దివ్యముగా ఫలియింప || పంపుము ||
3.
ఆసక్తితో ని – శ్చలనిశము సేవింప – భాసురంబగు నాత్మ – వాసి నెక్కంగా నిచ్చి || పంపుము ||