FaithWalk
← Back to Library

#608జాతీయ ఉత్సవములు – మాతృదేశ సేవ

Author: మార్తాండ జ్ఞాన ప్రకాశముComposer/Ragam: హిందూస్థానిCategory: క్రైస్తవ కుటుంబము
ప
దేశ సేవ చేసి దేవ – దాసులై వర్ధిల్లుడి ఇలలో – మోసమార్గములను వీడి – యేసుని నిజదాసులగుడి – దోషములను వీడి దేవ – దాసులై వర్ధిల్లుడి ఇలలో || దేశ ||
1.
దేశ బంధువు యేసువే మన – దేశ రక్షకుడు ఆయనే దేశమంత యేసు మనసుతో – నాశతో సేవించుడి || దేశ ||
2.
నీతి న్యాయంబులు కలిగియు – నిష్ఠలందు మెలగియు నిత్య ప్రేమ చూపి యేసు – నిష్ఠ లేక మేలు లేదు || దేశ ||
3.
వినయ శక్తి నెంతగా వివరించి బోధించిన విశ్వ విభుండౌ యేసు వినయ – విధము లేక మేలు లేదు || దేశ ||
4.
ప్రేమ కలిగి పరమ సత్య – ప్రేమ సేవ చేయుడి ప్రేమమూర్తి యేసుక్రీస్తు – ప్రేమలలో వర్ధిల్లుడి ఇలలో || దేశ ||
5.
ఆసేతు హిమాచల ప – ర్యంతమును దిగంతము లేకముగాను దివిని భువిని – నేలు రాజు యేసుడే || దేశ ||