#600సంవత్సరాద్యంతములు – సంవత్సరాంత ధ్యానము
Author: పులిపాక జగన్నాథముComposer/Ragam: బిలహరి (ఛాయ: కొనియాడదగినద నిన్ను)Category: క్రైస్తవ కుటుంబము
ప
ధ్యానింప నే చిత్తమా – వర్షాంతమున – ధ్యానింపనే చిత్తమా ధ్యానించ వాసక్తి – జ్ఞానంబు గలిగించు – జ్ఞాన స్వరూపుడు – జ్ఞానాత్మచే నీకు || ధ్యానింపవే ||
1.
అరయ నీ తలపుల – నఘము లగుపడు నీకు – పరిశుద్ధుండు వీక్షించ బహుగా గనపడుచుండు || ధ్యానింపవే ||
2.
పరికింప పలుకులు – పాపమగుపడు నీకు – పరిశుద్ధుండరయును గ – నపడకుండ నుండ దు స గది || ధ్యానింపవే ||
3.
క్రియలను చింతింప – మైల గనపడుగాన – భయమొంది నమ్మికను – బ్రదవే క్రీస్తుని దరికి || ధ్యానింపవే ||
4.
దేవుని ఘన ప్రేమ – దినదినము దలపోయ – నీవు పొందగ వచ్చు నిక్కమైన శుద్ధి || ధ్యానింపве ||
5.
స్మరియింప నీలోన – వర రక్షకుని పాట్లు – భరింప నోపుదువే – పాప మొక నిమిషంబు || ధ్యానింపవే ||
6.
హృదయంబు విమలాత్మ – సదనంబు గావింప – పదవే శ్రీఘ్రంబుగా – పరమ జనకుని కడకు || ధ్యానింపవే ||
7.
దేవుని సేవింప – స్థిరముగా నాశించి – దేవాత్మ కొరకు నీవు – దినము దేవుని వేడ || ధ్యానింపవే ||