#595మట్టల ఆదివారము
Author: ఇ. జె. ఆనందముComposer/Ragam: మోహనCategory: క్రైస్తవ కుటుంబము
ప
మనోవిలసితం బౌ – దినంబు – మహిమాన్వితంబు అనంత జగతీ మనోహరంబు – ఘనాది ప్రభు యశః ప్రకాశకంబు || మనో ||
1.
మందమారుతము లందము నొసగగ – డెందములకు నా నందము నిండగా సుందర పక్షుల సుమధుర గానము సుఖావాహం బై శోభించెను గా || మనో ||
2.
అరుణ భాస్కరుని కిరణాకరము – ధరణి దిక్తటముల దరిజేరెను గా ధరా వలయమఖిల భానునిచే దగదగితీయమై వెలిగెను గా || మనో ||
3.
పులుగుల కిలకిల కలరవములతో – పొందుగ గలసిన భూరి రవంబు లలిత మనోహర శ్రావ్యము వినుమా – తలపన్ దానికి కారణ మేమో || మనో ||
4.
రయమున ఒలీవ నగరంబు కనుమా – రభస యుక్తమగు జనమును కనుమా జయం జయంబను జయ ధ్యానంబులు – వియదంతము జనమ్రోగుట వినుమా || మనో ||
5.
ప్రసన్న వదనుడు – భానుతేజుడు – అసంఖ్య జనగణ పరివృత బలుడు ప్రస్తుత రాసభాసీనుడు యేసుడు – అసమ శాంతితో – నరుదెంచె నహో || మనో ||
6.
జయములు పాడెడి బాల చయముతో – సాత్వికుడై రాసభంబు నెక్కి జ్యోత్స్వవంబుతో సర్వేశ్వరుడు – చనిరా హృదయము సమర్పింతుదము || మనో ||