FaithWalk
← Back to Library

#593మట్టల ఆదివారము

Author: బన్యన్ ஜோసెఫ్Composer/Ragam: శంకరాభరణము (ఛాయ: యేసుని ప్రేమను)Category: క్రైస్తవ కుటుంబము
ప
యేసు విజయముతో – యెరూషలేమున – ప్రవేశము చేసినట్టి ప్రభువా వాసిగ బొగడగ – వసుధను జనులు – విజయము చేసినట్టి ప్రభువా || యేసు ||
1.
మట్టలు పట్టియు – బట్టలు పరచియు – గట్టిగా పాడగ నట్టి ప్రభువా అట్టహాసముతో – జవము నెక్కక – నణకువ గార్దభమెక్కిన ప్రభువా || యేసు ||
2.
పిల్లలు పెద్దలు – పలు కేకలతో – బలికి నుతించగా నట్టి ప్రభువా చల్లగ వానిని – సరియని యొప్పించి – సంతోషించినట్టి ప్రభువా || యేసు ||
3.
కొందరు వానిని – తొందర చేయగా – కూర్మిని దిద్దినట్టి ప్రభువా అందరు మానిన – అరుచును రాళ్ళని – ఆనతి నిచ్చినట్టి ప్రభువా || యేసు ||
4.
యెరూషలేము కొరకై – యెరుమి ఊపియు నేడ్చిన దయగల ప్రభువా యెరూషలేమందున – యాలయ మంతను – శుభ్రపరచినట్టి ప్రభువా || యేసు ||
5.
మాకొరకై తన – ప్రాణము బెట్టిన – మాన్యుడవీవే నట్టి ప్రభువా మాకొరకై ధరణి – మరణము గెల్చిన – మహిమ స్వరూపుడ నట్టి ప్రభువా || యేసు ||
6.
మాదు మనస్సును – హృదయము నాత్మను – నీదిగ గైకొనుమా మా ప్రభువా సాదర వాక్కులు – చక్కగా బలికియు – నాదరింపము మమ్ము ప్రభువా || యేసు ||