#592The Creed
Author: ఎస్. వి. సైమన్Category: క్రైస్తవ కుటుంబము
1.
విశ్వాకాశమూలాదులను సృష్టించిన విభుండు పరమ ఈశుండు సర్వశక్తుడు భాసుర తండ్రిని నమ్మెదను – నమ్మెదను నేను నమ్మెదను.
పరిశుద్ధాత్మ వలమున మరియ కన్యకా గర్భమున ధరింపబడి పుట్టిన శ్రీ గురు ప్రభు యేసును నమ్మెదను – నమ్మెదను నేను నమ్మెదను.
పొంతి పిలాతు కాలమున నెంతో శ్రమపడి సిలువబడి వింతగ మృతి భూస్థాపనయు బొంది యధోతల ముందెనని – నమ్మెదను నేను నమ్మెదను.
మూడవనాడు మృతి నుండి వడిగా బునరుత్థానుడై చూడగ బరమున కేతెంచె నాధుని కుడియెడ గూర్చుండెనని – నమ్మెదను నేను నమ్మెదను.
అక్కడనుండి ఇహమునకు గ్రక్కున వచ్చి సజీవులకు నిక్కము న్యాయము మృతులకును చక్కగ దీర్చునని మదిని – నమ్మెదను నేను నమ్మెదను.
పరిశుద్ధాత్మను నమ్మెదను – నమ్మెదను నేను నమ్మెదను.
పరిశుద్ధ పరచబడిన సర్వసాధారణ సంఘందేహ పరిశుద్ధుల యన్యోన్యమగు పరిశుద్ధ స్నేహము కలవంచు.
మహికర్మ పరిహారమును బునరుత్థానమును బహుళము నిత్యజీవమును మహిమ యనంతమై వెలయునని – నమ్మెదను నేను నమ్మెదను ఆమెన్.