FaithWalk
← Back to Library

#59O day of rest and gladness

Author: క్రిస్టఫర్ వర్డ్స్ వర్త్ (అనువాదం: జేకబ్ చేంబర్లేన్)Translator: జేకబ్ చేంబర్లేన్)Category: సాయంతనారాధన
1.
సుక్షేమ శుభకాల విశ్రాంతి దినమా విచారమెల్ల తీర్చు దైవాది వారమా ఈనాడు మేము కూడి దేవాాలయంబున మా ప్రత్యేక దేవ స్తుతి గావింతు మెంతయు.
2.
నీయందు సృష్టికర్త విశ్రామ మొందెను నీయందు యేసు క్రీస్తు మృత్యు బంధమును తెంచుకొంచు తాను లేచి చావును జయించెను నీ యందు పావనాత్మ మాకియ్యబడెను.
3.
భూవాసు లీ దినంబు సంతోషపడుచు సువార్త విని, పాడి మా యేసు స్తోత్రము పితృ పుత్ర శుద్ధాత్మ త్రిత్వంబు దేవుని ఉత్సాహ ధ్వనితోడ నెంతో నుతింతురు.