FaithWalk
← Back to Library

#584ఆలయ ప్రతిష్ఠ – ప్రభువా నిన్ను స్తుతింతుము

Author: బి. ఇ. దేవరాజుComposer/Ragam: యదుకులకాంభోజి (ఛాయ: తనువు నాదిదిగో)Category: క్రైస్తవ కుటుంబము
ప
స్తుతియింతుమో ప్రభువా – శుభమౌ నీ దినమున – పరిశుద్ధమగు నీ నామము గతకాలమున నీవు – పతితులమగు మాకు – అతిదయతో జేసిన – యన్ని మేలులు దలచి || స్తుతి ||
1.
ఎన్న శక్యముగాక – యున్న మహిమతో వెలుగు – చున్న నీ పద సన్నిధిని – సన్నుతాత్య మేము – ఆత్మతో సత్యముతో – నిన్నా రాధింతుము యీ – చెన్నౌ నీ గృహమునందు || స్తుతి ||
2.
ఇచ్చట నీ వాక్యము – నుచితరీతిని చాట – నీ సేవకుల నందరిని – శుచియౌ నీ యాత్మతో – పరిపూర్ణముగా నింపి – ప్రచురింపను శక్తి – నధికముగా నిమ్ము || స్తుతి ||
3.
భక్తితో నీ జనులు – యుక్తముగా నిన్ను వేడ – శక్తి వారి కిమ్మేప్పుడు – ముక్తి కోసము నిన్నా – శక్తితో ప్రార్థింప – రక్తితో విని వారి – కానందమును గూర్చు || స్తుతి ||
4.
జనక కుమారాత్మ – లను దేవ నీ కెప్పుడు – డెనలేని స్తుతి కలుగును – ఆనయము మేమిలలో – కొనియాడుటకు నిన్ను – ఘనునడా దీవెన మాపై – కుమ్మరింపుము వేగ || స్తుతి ||