#583కోత పండుగ
Author: గుంజా వెంకటరత్నముComposer/Ragam: శంకరాభరణముCategory: క్రైస్తవ కుటుంబము
ప
యెహోవా సన్నిధిని – నీ స్తోత్రగానముతో – మహోపకారునకు – మానుగ నర్పణ సమర్పించుడి || యెహోవా ||
1.
ప్రభు నడుగు నర్పణలు – ప్రేమ కృతజ్ఞతలు – అభయ ప్రధానములు – విభునకు నియ్యుండు విరివిగను || యెహోవా ||
2.
రిక్తహస్తములతో – రావలదు సన్నిధికి – భక్తవత్సలునకు – శక్తికొలది మీ రర్పించుడి || యెహోవా ||
3.
శృంగారాలయ మీ లలోన – పొంగారుగ కట్టుటకు – బంగారు వెండియును – బాగుగ నియ్యుండు ప్రభు పేర || యెహోవా ||
4.
వర మానవములచేత – వాంఛింపవలదండి – గురు నాజ్ఞ చొప్పునను – విరివిగ హృదయము లర్పించుడి || యెహోవా ||
5.
యెహోవా జనులారా – ఇయ్యుండి మనసార – యยహోవా యిచ్చినది – యేసున కర్పణ చెల్లింతము || యెహోవా ||