#581కోత యజమానుడు
Author: కడియం గాబ్రియేలుComposer/Ragam: బిలహరి (ఛాయ: యేసు నాథ కథా సుధారస మిదిగో)Category: క్రైస్తవ కుటుంబము
ప
కోత యజమానుండ స్తోత్రమున్ – గూర్మితో నొనరింతుము – ప్రీతి మీరగా మాదు పొలములు – పెరిగి పండెను గావునన్ || కోత ||
1.
నీదు సేవకులైనవారలు – నిండు మోదమున్ నొందుచు – నీ దయ నొక యేటి గ్రాసము – నీ దినంబున గాంతురు || కోత ||
2.
విత్తుకాలము కోతకాలము – విమలమైన తలంపులు – చిత్తమున్ బుట్టించి మాకతి క్షేమ మొసగితి రక్షకా || కోత ||
3.
వేసవిని భువి మేము నాటిన – విత్తనం బతిరమ్యమై – భాసురం బగు పచ్చ మొక్కరై – బయలువెడలె నిది చిత్రము || కోత ||
4.
జల సమాధిని వెడలి చక్కగా – బలముతో నీ గింజలు – బలుడు దేవుని శక్తి చేతను – బాగుగాను ఫలియించెను || కోత ||
5.
ఆ ప్రకారమె నీదు నామము – నందు కాలము చేసి యా ప్రజల దేహములు మహిమను – నంద జేయుము రక్షకా || కోత ||
6.
కోత కార్యంబువలన గూడెడి – కూర్మిచే నీ బిడ్డలు – నీతులను నేర్పొంగ జేయుము – ప్రీతిగల మా రక్షకా || కోత ||
7.
దూత లంత్య దినంబునందున – కోత గోయుదు రంతటా – నా తరుణమున గురు గులన్నియు – నగ్నిలో బడన్ బైతురు || కోత ||
8.
లోకమందలి గాలి వానల – లోను మేమునిక నుండక – నాకమందున తండ్రి మింటను – నేకముగా జీవింతుము || కోత ||
9.
నీవు నేర్పిన యట్లే మేమిల – నిన్నున్ బ్రతిదినమందును – జీవనోపాయంపు భుక్తిని – దేవ వేడగా జేయుమీ || కోత ||
10.
మే మింక నే పోషింపను నన్న – పానములనే వేడక – జానుగా నాత్మలకు నౌబోధ – జనము వేడ నీయుమీ || కోత ||
11.
వసుధ నిన్నున్ బ్రార్థించు జన ర – వంపు రొట్టెవు నీవెగా – అనువు నాదరణంబు భుక్తిని – యగుము మా కిల నెప్పుడును || కోత ||