FaithWalk
← Back to Library

#563వివాహము

Author: UnknownComposer/Ragam: జంఝూటిCategory: క్రైస్తవ కుటుంబము
ప
మానవుల మేలు కొరకు – జ్ఞానియైన దేవుడు – మానుగ కల్యాణ పద్ధతి – మహిని నిర్ణయించెగా ||మానవుల||
1.
కానాయను నూరిలో మన – కర్తచూచె పెండ్లిని – పానముగాను ద్రాక్షారసము – దానమొసగె ప్రీతిని ||మాനవుల||
2.
యేసూ వీరిద్దరిని – ఏకముగాను చేయుమీ – దాసులుగాను చేసి వీరి దోషము లేడబాపుమీ ||మాനవుల||
3.
కర్త వీరికు భార్య – భర్తల ప్రేమంబును – బూరిగా నిచ్చి వీరి బొందుగాను నడుపుమీ ||మానవుల||
4.
భక్తియు విశ్వాస ప్రేమలు – భావమందు వ్రాయుమీ – ముక్తి శరణి వెదక వీరి భక్తి మిగుల జేయుమీ ||మానవుల||