FaithWalk
← Back to Library

#561వివాహము

Author: విలియం డాసన్Composer/Ragam: సురటి (ఛాయ: కూడికొని యున్నాము)Category: క్రైస్తవ కుటుంబము
ప
కోరుకొని యున్నాము – యేసు ప్రభూ – కోరుకొని యున్నాము సార కల్యాణ గుణమణి – సన్నిధి నీ సన్నిధిని ||కోరుకొని||
1.
చారు వివాహోత్సవము ఘనముగా చేయన్ గోరి దర్శనమిచ్చితివి గనుక – గారిమితో నిదిగో పెండ్లికి మాకున్ గారపు చుట్టముగా నిన్ను యేసూ ||కోరుకొని||
2.
కరములు జోడించి పరస్పర ప్రమాణ భారము మోసిన యీ దంపతుల మీద – వర కరుణైక్యతకున్ వదన గ్రహ కిరీటము రచించి తద్బంధమును నీవే దీవింప ||కోరుకొని||
3.
చనువొప్ప వారు క్రైస్తవ జాగ్రత్తలన్ దమ తమ వంతులు భుజించి – యొనసి సంసార భారమును అలకన పరుచుకొను తదాత్మల మేళన నీవు దయచేయ ||కోరుకొని||
4.
ఘన విశ్వాస ప్రార్థన కోరికలయందున్ దనర నొక్కరి కొక్కరు దయచూపుచు – నొనర కుటుంబంబు నురువు నొందింపగ మనసార దత్సంతతిని గాన డయచేయ ||కోరుకొని||