#531Be Not Swift to Take Offence
Author: అనువాదం: బర్నార్డ్ లూకన్Translator: బర్నార్డ్ లూకన్Category: క్రైస్తవ కుటుంబము
1.
రేగక త్వరపడకు – ఓర్చుకో – కోపి గొడవ జెందును ఓర్చుకో – నీకన్యాయమైనను – కన్నులెఱ్ఱ చేయకు శాంతమొందు మెప్పుడు ఓర్చుకో.
ఎవ్వడైన నిన్ను తిట్టిన ఓర్చుకో – మేలు చేయు కీడుకు ఓర్చుకో – లోకమందు సుఖము కొంతసేపు నుండును కోపమేల జేతువు? ఓర్చుకో.
నీవు కీడునొందగా ఓర్చుకో – ప్రతి కీడు చేయకు – ఓర్చుకొని యుండుము అంత సరియగును నీకు జయముండును ఓర్చుకో.