FaithWalk
← Back to Library

#527యువజనులకు క్రీస్తు ఆహ్వానము

Author: బొంతా నతానియేలుCategory: క్రైస్తవ కుటుంబము
ప
ఓ క్రైస్తవ యువకుడా – నిజమంతయు గనుమా నీ బ్రతుకంతయు మారుటే మేలు – కోరుము జీవమునే ||ఓ||
1.
పాపపు చీకటి – బ్రతుకేలా – శాపపు భారము నీకేలా – పావన ప్రభుని పాదము జేరిన – జీవము నీదగుగా ||ఓ||
2.
భయపడి వెనుకకు పరుగిడక – బలమగు వైరిని గెలిచెదవా – బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన – గెలుపే నీదగుగా ||ఓ||
3.
మారిన జీవిత తీరులలో – మానుగ నీ ప్రభు సేవకు రా – మహిమ కిరీటం మన ప్రభు సేవలో – ఘనముగా నీదగుగా ||ఓ||