FaithWalk
← Back to Library

#519క్రైస్తవ గృహము

Author: ఈ.ఎల్. ఆనందముComposer/Ragam: కాంభోజిCategory: క్రైస్తవ కుటుంబము
ప
రమ్ము రమ్ము మా ఇంటికి తండ్రీ రమ్ము రమ్ము ||రమ్ము||
1.
జగములగన్న ప్రేమ గర్భుడవు – జగములకువల నుందువు నీవు సరగ రమ్ము నీ బిడ్డల గృహమును సందీపంబు చేయ ||రమ్ము||
2.
సంతోష ప్రేమాశాంతంబుల నిశాతం బై యీ గృహ – మెల్లప్పుడు – సంతత స్వర్గవాసరూపమై – సమృద్ధి పొందునట్లు ||రమ్ము||
3.
అనలజ్వాల సపర్యలు వదలి – యనిలపక్ష సంచరణమువదలి అనయము నీ గృహవాసివి నీవై – యాశీర్వదించునట్లు ||రమ్ము||
4.
నీ ఘననామోచ్చారణము చేత – నీ గృహమెల్లను పావనమై నీ యాగప్రేమ మర్మంబులు జగతి – బాగుగ దెలియునట్లు ||రమ్ము||