FaithWalk
← Back to Library

#517మాదిరి కుటుంబము

Author: వేషపోగు గులాబనమ్మComposer/Ragam: ఖరహరప్రియ (ఛాయ: ప్రభువా పంపుమా)Category: క్రైస్తవ కుటుంబము
ప
యెహోవా యందు – భక్తి – బహుగ గలిగియుండి – మహిమాఢ్యుని మార్గంబులయందు – గృహముల నడుపు నరులే ధన్యులు ||
1.
దేవుని యందలి – భయము – దీనుల దీవించును నీవు నీ చేతుల కష్టార్జితమును – నిత్యము ననుభవింతువు నిజముగ ||
2.
ఉల్లమలర భార్య – ద్రాక్ష – వల్లివలె ఫలింప పిల్ల లొలీవ మొక్కల చందము – పెంపొందుదురు రెంతయు సొంపుగను ||
3.
దేవుని భక్తియే – నీకిల – దీర్ఘాయువు నిచ్చును గావున నీ పిల్లల పిల్లలను గాంతువు ప్రభు కృపతో వెలుగుదువు ||