#509పరలోక వర్ణన
Author: చదలవాడ జకరియాComposer/Ragam: శహన (ఛాయ: మన మొదటి తల్లిదండ్రులందు)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
చక్కని పరలోక – సంబంధులతో గూడి – సంతోషించుట యెన్నడో మిక్కిలి ప్రియమైన – తండ్రి దేవుని యెదుట – మ్రొక్కి పాడుట యెన్నడో ||చక్కని||
1.
నిత్యము విలసిల్లు – నిజరత్నపునాదు – ల తుల్యోత్తమ పురమున – ముత్యాల ద్వారముల – ముదముతో బోవుచు – నృత్యమెప్పుడు చేతుమో ||చక్కని||
2.
పన్నెండు ద్వారముల – పరమపురమును నా – కన్నులంచుట యెన్నడో చెన్ను మీరనగ – భక్తశ్రేష్ఠులతో గూడి – సనుతించుట యెన్నడో ||చక్కని||
3.
పరిశుద్ధదూతలతో – ప్రభుయేసు మరల ఈ – ధరకు దెంచుట యెన్నడో పరిపూర్ణులతో గూడి – బహుమానమును బొంది – మురియుచుండుట యెన్నడో ||చక్కని||
4.
మహిమకిరీటము – ధరియించియున్న యా – మహితునిగను గను గను గను – గనెన్నడో అహహా యా ప్రభునితో – మహిమ పరచబడి – మహికి దెంచుట యెన్నడో ||చక్కని||
5.
పాపశరీరము బాసి – ప్రభుని యొక్క – రూపనొందుట యెన్నడో పాప మరణ దుఃఖ – మీ యాపదల కెడ – బాపనొందుట యెన్నడో ||చక్కని||
6.
రమ్ము రమ్ము యేసు – మమ్ము నీ పురముకొని – పొమ్ము వేగముననే ఇమ్మహి కష్టములనుండి – నెమ్మదినే – త్యమ్ము నిమ్ము వేగమే ||చక్కని||