FaithWalk
← Back to Library

#508పరలోకపు విందు

Author: బేతాళ జాన్Composer/Ragam: జంఝూటిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
విందు పరమమందు పెండ్లి – విందు పరమమందున – బొందు జనుల డెందములా – నందము నొందు ||విందు||
1.
సత్యసంధుడైన యేసు – స్వామికి సభకు నిత్య ప్రదానము యెహోవా – నిర్ణయించెను రండు ||విందు||
2.
నీతి గల కరములతోడ – నిన్ను బ్రధానము ప్రీతిగా నొనరించితి నని – పిలిచే సత్యము రండు ||విందు||
3.
ఎన్నడు విననాడును నేను – నెంతమాత్రము నిన్నెడ బాయనను మాట – నిజము దత్తము రండు ||విందు||
4.
పరమ నగర ద్వారములు – తెరవంబడినవి గురుతర మణితోరణమును – గూర్పంబడినవి రండు ||విందు||
5.
నిత్యజీవ పదార్థములు – నిండియున్నవి సత్యమచ్చట మనము చేర – సర్వము మనవి రండు ||విందు||
6.
దూతలంత యేసు ప్రభుని – స్తుతి చేయును నూతన సంగీతములను – జేతురు వినను రండు ||విందు||