FaithWalk
← Back to Library

#500పరిశుద్ధుల కొరకు

Author: విలియం వాల్షం హౌ (అనువాదం: హెచ్. హెన్రీ డేవిస్)Composer/Ragam: ఇంగ్లీష్ మూలం: For all the saintsTranslator: హెచ్. హెన్రీ డేవిస్)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
సద్భక్తితోడ సాక్షులై నిత్య విశ్రాంతి నొందువారిన్ జూడగా శ్రీ యేసు నామమున్ స్తుతింతుము హల్లెలూయా! పోరాటమందు వారి దుర్గమౌ శ్రీ యేసు సంరక్షించు శైలము అంధత్వమందు జీవకాంతియు హల్లెలూయా! ఓ యోధులారా! ధైర్యశాలురై పూర్వుల బోలి యుద్ధమాడుడి జీవ కిరీటంబు మీ కబ్బును హల్లెలూయా! ఓ దివ్యసభ! స్నేహభావములు! అన్యోన్య సహవాసమున్ నమ్మిక గల క్రీస్తువారలు! హల్లెలూయా! మోక్షంబున జేరి భక్తులెల్లరు పితృ పుత్ర శుద్ధాత్మలన్ సదా విజయ నుతితోడ కీర్తింతురు హల్లెలూయా!