FaithWalk
← Back to Library

#465లెమ్ము తేజరిల్లుము

Author: తూటూరి ప్రకాశముComposer/Ragam: కల్యాణిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
లెమ్ము తేజరిల్లుము నీకు – వెలుగు వచ్చియున్నది – ఇమ్ముగ ప్రభుని మహిమ – ఇదిగో నుదయించె నీపై ॥ లెమ్ము ॥
1.
జనములు నీదు వెలుగునకు – జనుదెంచెదరు గనుమా – తనర నీ యుదయ కాంతికి – తరలి రాజులు వత్తురు ॥ లెమ్ము ॥
2.
సముద్ర వ్యాపారంబు – సరి త్రిప్పబడు నీవైపు – అమరుగ జనుల యైశ్వ – ర్యము వచ్చు నీ యొద్దకు ॥ లెమ్ము ॥
3.
గొంజి దేవదారు సరళ – వృక్షాలు నాలయంబునకు – ఎంచి తేబడు నా పాద – క్షేత్రము గొప్పగ జేతు ॥ లెమ్ము ॥
4.
నిత్యమౌ కాంతితోడ – నిన్ను వెలిగించెదను – నిత్య సంతోషమునకు – నిన్ను కారణముగా జేతు ॥ లెమ్ము ॥
5.
ఎంచంగ నొంటరిగాడు – ఎసగు వేయిమందియై – ఎంచంగ దగిన నాడే – ఎంతో బలమగు జనమగును ॥ లెమ్ము ॥