FaithWalk
← Back to Library

#463సువార్త సేవా భారము

Author: కేసనపల్లి అబ్రాహాముComposer/Ragam: ఆనందభైరవిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
భారమైనది సేవ – మరణము కన్న – భారమైనది సేవ – ఘోర నరకపు దారి – చేరి నడిచెడి వారిన జేరి వారితో – సం ప్రదించి ప్రభువును చూపి – ఘోర నరకపు బాధలన్నియు – కూర్మితో వినజెప్పి – మోక్షపు – దారికిని – నడిపించి – యేసుని – దాపునకు నడిపించు దారి ॥ భారమైనది ॥
1.
దురిత దుర్గతి నశియించు వారిని జూసి – పరితాప – మొందవలయున్ – మారుమనస్సు నొంది – చేరి ప్రభునితో గలిసి – ఘోర పాపిని నేనని – వేడి – సిలువ ధ్యానించి – దురితములను – చేయనని తీర్మానములను చేసికొని – రక్షింపబడినది గురుతుగా సాక్ష్యంబు నిచ్చుటయే దారి ॥ భారమైనది ॥
2.
ప్రథమ దశ భాగంబుల – ప్రభునకు నిచ్చి – ప్రతిదినము ప్రార్థింపవలెన్ – అధములగు – బీదలకు నాధారముల నొసగి – విధిగ భక్తుల – నాదరించి – సవరించి – ప్రభువు వాక్యము – చదువుకొనుచు – ప్రభుని పాటలు పాడుకొనుచు – ప్రభుని వేదము ప్రచురపరచి – పదిలముగా – జీవింపగోరి ॥ భారమైనది ॥
3.
దేశదేశముల దిరిగి – దేవుని వాక్యము – దేశప్రజలకు చాటవలెన్ – ఆశాదురాశలను – కోసివేసి యేసు – దాసులను జేసి – వెలిగించి తిలకించి – యేసుభక్తుల పదిలపరచి యేసుతో – పరిచయము చేసి – యేసును ధరియింప జేసి – యేసుతో నివసించు దారి ॥ భారమైనది ॥