#458సేవ కిదే యుక్త సమయము
Author: UnknownComposer/Ragam: సౌరాష్ట్రCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
ప్రభు సేవ కిదియే సమయంబు – ప్రజల విమల – ఫలముల నొంద
నిదియే సమయంబు ॥ ప్రభు ॥
1.
మరణంబు బడక ముందే – ఘోర – తరమైన పాపాత్మ – లరసి గుణ పడంగ –
నరక వేదన బాపు కొరకు – దేవున్ జెరి మరి తెలియ నెంతో– కరుణతో నొస
గె నె ॥ ప్రభు ॥
2.
కరుణ గల్గెడి దివసములలో – నీవు – పరమ భాగ్యంబులు – బడియుంగ వచ్చు –
మరణం బెరిగిన జీవాత్మ – యది – మరుచేద విది యెంతో ॥ ప్రభు ॥
3.
పశ్చాత్తాపం బనెడి తలుపు – మూయ – బడుము దేవుని కరుణా – భాగ్య
మను తలుపు – నిశ్చయముగా వేయ బడు –
నెంతో – యాశ్చర్యకరమౌ – నవన మగుపడదు ॥ ప్రభు ॥
4.
సారస్యమైన కార్యంబుల – జేయ – సమయ మనెడి తలుపు – సరగ
మూయబడును – వారక మృతి బొందునప్పుడే – గాక – సార కార్యము లన్ని – చక్కగా జేయు ॥ ప్రభు ॥
5.
గత దినంబులకై స్తుతింతును – మిగుల – కఠినంబులైనట్టి – గండముల
నుండి – ప్రతిదినంబును దప్పించుచు – నెంతో – మితిలేని కృపచేత – బ్రతికించు మమ్ములను ॥ ప్రభు ॥
6.
నీతియుతులుగు భక్తులారా – మన – పాతకములకు జచ్చి – పరమేశ్వరుని
– ప్రీతి మ్రొక్కులు చెల్లించుదము – నూతన – వత్సరము ప్రభు – స్తుతికై
బ్రతుకుదుము ॥ ప్రభు ॥