FaithWalk
← Back to Library

#457క్రీస్తు కొరకు సేవ

Author: బునమల బెంజమిన్Composer/Ragam: ఖరహరప్రియCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
శ్రీ యేసుని వేడు – మనసా – సేవింపవే నేడు – నీ యుప ములు బాపియు నిన్ను నెడ – బాయక కడు సహాయము జేసెడి ॥ శ్రీ యేసుని ॥
1.
పాపంబులు వీడి – పశ్చా – తాపంబును గూడి – దాపున జేరుము – దయగల ప్రభువు నీ – పాపము బాపియు బాలించును ధర ॥ శ్రీ యేసుని ॥
2.
దేవుని మరువకుము – దైవ – సేవను మరువకుము – జీవపు ద్రోవను – స్థిరముగా నడువను – పావన మనసును – బ్రాపుగా నిచ్చెడి ॥ శ్రీ యేసుని ॥
3.
రక్తము చిందించె – ప్రభువు – రక్తితో నీ కొరకు – రక్తపు టూటల – శక్తిని నమ్మిన – ముక్తి కలుగును – భక్తితో నీవు ॥ శ్రీ యేసుని ॥
4.
సిలువయే నీ ఘనము – క్రీస్తు – సిలువయే నీ ధనము – సిలువయే భాగ్యము – తులువల కెల్లను – సిలువ వలననే – కలుగును రక్షణ ॥ శ్రీ యేసుని ॥