#456క్రైస్తవ సేవ
Author: మొలతాటి విద్యానందముComposer/Ragam: సావేరిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
సంతోసంబున వత్తు – సర్వేశ్వరుని చిత్త – మెంతయు నెరవేర్చెదను – వంతలు
విడి
నాదు – నంతరంగము కదుర – నెంతొ విశ్వాసమున – వెంట వచ్చె
దను ప్రభువా ॥ సంతో ॥
1.
సురుచిరముగు మరియ – సూనుని యాజ్ఞలు –
శిరమున నిడికొందును – మరియ మనసుతో – మార్తమ్మ కరములతో – బరమ
సౌఖ్యము బొంద – భక్తితో సేవింతు ॥ సంతో ॥
2.
నా రాజు సేవ దు – ర్భరమై బాధగా నున్న
– భారంబుగాను దోచదు – సారెసారెకు – దనదు – చక్కని చిరునవ్వు – వారించి
భారమును – ధీరత నొసగును ॥ సంతో ॥
3.
కారుణ్యమున నాదు – కల్మషమయ హృదయ
– భారములను మోసితి – ఆ రాజ్యమునగల – యాస్తికై నా చిత్త
– మాలసింపక నెత్తి – యందే స్థిరముగా నుంచు ॥ సంతో ॥
4.
ఈ యిల నే జేయు – సేవకు ఫలములు – నీ
చోట గనుగొందునే – కాయం బీదర – కర్మలం గరపిన – నా యాస్తి నా
హృదయ – మా లోకమున
మండు ॥ సంతో ॥