#451నీ చిత్తమే సిద్ధింప ప్రభువా
Author: ఎ. చార్లెస్ కిన్సింగర్Composer/Ragam: శంకరాభరణంCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
సర్వ చిత్తంబు నీదేనయ్యా – స్వరూపమిచ్చు
కుమ్మరివే – సారెపై నున్న మంటినయ్యా – సరియైన పాత్రగా జేయుమయ్యా –
సర్వేశ్వరా నేరిక్తుండను సర్వదా నిన్నే సేవింతును ॥ సర్వ ॥
1.
ప్రభూ! సిద్ధింతు నీ చిత్తమే –
ప్రార్థించుచుంటి నీ సన్నిధి – పరికింపు నన్ని దివసంబున – పరిశుభ్రమైన
హిమముకన్న – పరిశుద్ధుడన్ జేసి పాలింపుమా – పాపంబుబోవ నన్ను గడు
గుమా ॥ సర్వ ॥
2.
నీ చిత్తమే సిద్ధించు ప్రభువా – నిన్నే
ప్రార్థింతు నా రక్షకా – నీచమౌ గాయముల చేతను – నిత్యంబు కృంగి
అలసియుండ – నిజమైన సర్వశక్తుండవే – నీ
చేత బట్టి నన్ను రక్షింపుమా ॥ సర్వ ॥
3.
ఆత్మస్వరూప నీ చిత్తమే – అనిశంబు చె
ల్లు ఇహపరమున – అధికంబుగా నన్ని యాత్మతో – నావరింపుమా నా రక్ష
కా – అందరూ నాలో క్రీస్తుని జూడ – ఆత్మతో నన్ను నింపుము దేవా ॥ సర్వ ॥