FaithWalk
← Back to Library

#449నీ చిత్తం బేను

Author: ఎ. ఎ. పొల్లార్డ్ (అనువాదం: ఎం. జె. రామానుజాచార్యులు)Composer/Ragam: ఇంగ్లీష్ మూలం: Have Thine own Way LordTranslator: ఎం. జె. రామానుజాచార్యులు)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
నీ చిత్తంబేను – నీ చిత్తంబే నేను మట్టిని – ఓ కుమ్మరి! నీ కోర్కెదీర – నన్ను దీర్చుమా నీకు లొంగెదన్ – ఓ ప్రభువా ॥
1.
నీ మార్గంబేను – నీ మార్గంబే నేడు నన్ను – బరిశోధించు శుద్ధిజేయ మో – యేసూ నన్ను నీ సన్నిధిలో – మోకరింతును ॥
2.
నీ కోర్కె యేసు – నీ కోర్కెయే నే గాయంబోంది – అలసితిన్! బాగుచేయు నన్ – ముట్టి ప్రభో నీకే సమస్త – శక్తి నొప్పుదున్ ॥
3.
నీ యిష్టంబేను – నీ యిష్టంబే నీ యాత్మతోడ – నన్ను నింపుమా నా యందెలరు – క్రీస్తు నుండన్ నీ యాధీనంబు – నన్నుంచుకో అప్పుడు నేను – నీ రీతిగాన్ తప్పక జేతు – నా ప్రభువా ఇప్పుడే నీదు – సేవ చేయుదున్ అప్పగింతు నా – సమస్తంబు ॥