FaithWalk
← Back to Library

#448సమర్పణ ప్రార్థన

Author: మాధవభక్తుల దావీదుComposer/Ragam: ముఖారిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
కొనుము మా హృదయంబు – లను నీకర్పించెద – మనయము నుతియించుచు – ఘనముగా గృపచేత మము గా – చినను మేము మెంతయు నెనరు గల – మనుచు నీ పాదముల కెరగుచు – ననిశమును నీ కృపను – దలంతుము ॥ కొనుము ॥
1.
బలహీనులము మేము – బలవంతుడవు నీవు – బల మిచ్చి మము నడుపుము – ఇలను మేము యింక బ్రతుకు – దివసంబులను నీ పద భక్తిచే – నెపుడలయ కుండగ మమ్ము గాడు ని – ర్మలిన హృదయుల జేసి కరుణను ॥ కొనుము ॥
2.
ఘోరారణ్యము భువి వి – చార సంకలితము – భూరి భయంకరము – దారి లేదు యింక నీవు తప్ప – వేరే సాధన మెచ్చట గానము – కోరి మము నందరిని నీదరి – జేర్చుకొను మార్గమును జూపు ॥ కొనుము ॥
3.
గత వత్సరమున నీ – యతులుమౌ కృపచేత – పతితుల మము గాచితి – మతి వినమ్రుల మగుచు మా మా – మతులలో నీ ప్రేమ దలచుచు – మతి విహీనత వీడి యింక నిన్ను – సతత తత్త్వము సేవింతుమయ్య ॥ కొనుము ॥
4.
ఈ వత్సరంబున – నెవ్వరు మాలోన – పోవుదురిలను విడిచి – దేవవారలు భు విని వదలి – పోవు కాలమందున దిమ్మరి – ద్రోవలో వారలను సుఖముగా – బ్రోవ దొర్కొని పోవుమయ్యా ॥ కొనుము ॥
5.
మమును విశ్వాస – మార్గమందున దోడ – నిమ్ముగా గొని పోవుచు – నమ్మి నీ ప్రియ సేవకుల బృందం – దేవుమునకు సిద్ధంబులగు మాకు – టములను మేము పొందుటకు వే – గమ్ముగా బాత్రుల జేసి ॥ కొనుము ॥
6.
శోధనల యందున – బాధల యందున – నాదార్పు మా కొసంగుము – శోధనలచే మాకు మరియును – శుద్ధమగు హృదయ ంబు లిచ్చుచు – శోధనల్ ఫలియింప జేయుము – బాధకములు గాక యుండ ॥ కొనుము ॥
7.
ఈ లోక దుఃఖము – లెల్ల నేగిన పిదప – నీ లోకమును జేరగా – పాలుమాలక మేము మామా – పరుగు నెత్తెదము సాయమిమ్మో – యేలికా నీ కరములను మ – మ్మెప్పుడుకొని నడువంగ నేర్పు ॥ కొనుము ॥
8.
దురితంబు లెల్లను – గరుణచే గడిగి నీ – పరమందు మము జేర్చుము – నిరత మును మేమచ్చట నీ కృప – విరివి నెంతయు బొగడుచును మా – కరముల బంగారు వీణెలు – నెరవుగా గొని మీటుచుందుము ॥ కొనుము ॥