FaithWalk
← Back to Library

#447సమర్పణ

Author: డి. వి. డానియేల్Composer/Ragam: యమునాకల్యాణిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
సృష్టిపితా – సర్వోన్నతా – సమర్పింతున్ – సర్వస్వమున్ ॥ భూమి యాకాశము నీవే – భూధర శిఖరములు నీవే – భూప్రజలు నీవారే – బలశౌర్యములు నీవే ॥ సృష్టి ॥
1.
మా వెండి బంగారములు నీవే – మాకున్న వరములు నీవే – మా దేహములు – మా గేహములు మా జీవితము నీవే ॥ సృష్టి ॥
2.
వెలలేని గాలి వెలుతురులు – విలువైన పాడి పైరులు – వివిధంబులైన దీవెనలు – నీ కరుణా వర్షములు ॥ సృష్టి ॥
3.
పరిశుద్ధ గ్రంథపు పలుకులు – పరలోక తేనె చినుకులు – ప్రభు యేసుని మాటలు – మా వెలగ బాటలు ॥ సృష్టి ॥
4.
మాదంత నీదే మహాదేవా – మా రాజువయ్యా యెహోవా – మా తనువులు మా బ్రతుకులు మా యావదాస్తి నీవే ॥ సృష్టి ॥
5.
మేమిచ్చు కాన్క యేపాటిది? యే ప్రేమ నీకు సాటిది? – మోక్ష నాథా యేసుప్రభో - అంగీకరించు విభో ॥ సృష్టి ॥
6.
తండ్రి కుమార శుద్ధాత్ముడా – త్రియేక దేవ స్తోత్రములు – దాత వీవే నేత వీవే – దేవాది దేవుండవే ॥ సృష్టి ॥