FaithWalk
← Back to Library

#446నా సిలువ

Author: వంతగాని పరదేశిComposer/Ragam: బిలహరిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
యేసు! నా సిలువ నెత్తి – యిప్పుడు నే – నీ సుమార్గమున బట్టి – నా స్వజనము లనాదరంబున – ద్రోసినను బగచేసిన – నా సమస్తము నీవెగా యిక – నే సరకుగొన నేమియును ॥ యేసు ॥
1.
ఎన్ని శ్రమలు వచ్చిన – లోకపుటాశ – లన్ని భిన్నము నొందిన – నన్ను ఖిన్నుని జేయ నేరవు – సన్నుతుండును స్వర్గము – నన్ని నావైయున్న విగ నిక – నన్ను గదుపున దెవ్వరు ॥ యేసు ॥
2.
ఆపదలు నన్ను జుట్టిన – జేరుదు నే – నో పరాత్పర రొమ్మున – బ్రావ కుండువు పతితుడై నీ – దాపు జేరిన వానికి – దాప మాపుచు సంతోసంబిడి – ధన్యు జేయుదు వీవెగా ॥ యేసు ॥
3.
నిన్ను బ్రేమించెడు తండ్రిని – నా యాత్మా – నిన్ను రక్షించిన క్రీస్తును – ఘను నిన్ను జొచ్చిన ప్రియాత్మను – ఘన త్రైకుని నిత్యమును – గొనుము రక్షణ, పాపము జిం – తను విడిచి యింక నెన్నడును ॥ యేసు ॥
4.
విశ్వాస కవచంబును – మేను విడి – విజ్ఞాపనము చేయుము – శాశ్వతంబగు రాజ్యమునకు – సదయుడౌ ప్రభువు నడుపు – విశ్వసితము లభించునట నీ – విన్నపము స్తుతియును గా ॥ యేసు ॥