#445నేను నీ సేవకుడను
Author: పుлиపాక జగన్నాథముComposer/Ragam: ముఖారిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
నేను నీ వాడను దేవా – నిక్కంబుగా – నేను నీ వాడను దేవా –
వీనుల నీ ప్రేమ – వివర మాలించుచు – మేను నాత్మయు నిత్తు – మేలొసగు
నీకిప్పుడు ॥ నేను ॥
1.
ఘనుడవైన నీవు – గలిగించితివి నన్ను – మనుజ లోకమునందు – నిన్ను నేను
సేవింప ॥ నేను ॥
2.
నాకు నవసరమౌ – నానా వస్తువు లిచ్చి – నీ కటాక్షము నన్ను –
నిలుపుచున్నది గాన ॥ నేను ॥
3.
నా దోషములనుండి – నన్ను రక్షింపను – నీదు పుత్రుని ప్రేమ – నిండార నొసగితివి ॥ నేను ॥
4.
నేను పాపముల చేత – నిజముగా జావగా – నీ నెరవుచే నన్ను – నీవు
బ్రతికించితివి ॥ నేను ॥
5.
నా తనువు నాత్మయు – నాకు గలిగిన వన్ని – నా తండ్రి యిచ్చితివి – నాకు నీ
కృపచేత ॥ నేను ॥