#444జ్యోతిగ నన్ను జేయుము
Author: సి. డి. శుభా DirectComposer/Ragam: ఆనందభైరవిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
జ్యోతిగ నన్ను జేయుమో దేవా –
ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ జేయుమో దేవా –
జ్యోతిగ నన్ను జేసి మాలో – క్రీస్తు మార్గము బయలుపరచి –
నీతి ప్రేమలతోడ హృదయము – నింపి మమ్ము నడిపింపుమయ్యా ॥ జ్యోతిగ ॥
1.
మా కుటుంబము లోన నీ వెలుగు – ప్రసరించునట్లుగా – నాదు బ్రతుకును
శుద్ధి జేయుమయ్యా – మా కుటుంబములోని వారలు – మానకను నీ వెలుగు
చూపగ – మమ్ము నీ మార్గంబునందున – మనుపు పరిశుద్ధాత్మ
నిడుమయ్యా ॥ జ్యోతిగ ॥
2.
సంఘమున నీ కీర్తి కనపడగ – పరిశుద్ధ సహవాసంబులో నన్ను వృద్ధి
శక్తులన్నిటి – పారదోలగ శక్తినిడి నీ – భక్తి కాంతిని జూపి నాలో ॥ జ్యోతిగ ॥
3.
నిన్ను దెలియని యాత్మ లెన్నెన్నో – మా చుట్టునున్నవి – నీ కొరకై
కనిపెట్టుచున్నవయ్యా – అన్నివేళల నీ సువార్తను – అందరికి ప్రకటింప
మనసున – నాశనిడి నీ వార్త వెలుగును – అన్ని దిశలకు చాటునట్లుగా ॥ జ్యోతిగ ॥
4.
సమయమును వరముల నొసగితివి – మా రక్షకా ధన – సంపదను నీ
వె యొసగితివి – విమల జీవితమందు వానిని విరివిగా నితరుల
కొసగి – వీర త్యాగార్పణములతో నీ – వెలుగు ప్రసరింపగ జేయ
ను ॥ జ్యోతిగ ॥