FaithWalk
← Back to Library

#443సంపూర్ణ సమర్పణము

Author: వేషపోగు గులాబమ్మComposer/Ragam: యమన్Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
శ్రీ యెహోవా నీ కొసంగెద – శ్రేయమొదవగ నాదు సంపద – పాయక నీ సమ్ముఖమ్మున – నే యెడ నివసింతు భక్తితో ॥ శ్రీ యెహోవా ॥
1.
అడుగడుగుతో నీ పాదముల బడి – యొడయుడా నావల్ల నీకై – తడవు చేయక కొలుతు నిన్ను – తండ్రి నన్నంగీకరించుమి ॥ శ్రీ యెహోవా ॥
2.
నీవు నా రాజువు నిరతము – నేను నీ బిడ్డను నిశ్చయము – పావనాత్ముని యెదుట నాదు – జీవముడుదు సజీవ నవముఖర ॥ శ్రీ యెహోవా ॥
3.
ప్రభువరా యర్పించుకొందు – భక్తితోడ నన్ను నిందు – శుభప్రదము లగు శక్తులతో నన్ను – సొంపుమీరగ నింపు స్వామీ ॥ శ్రీ యెహోవా ॥
4.
మహిమస్తుతులు చెల్లును నా – మనంబునకు నిత్యంబుగాను – ఇహపరంబున బ్రోచువాడు – నీవే సుమ్మా లోక రక్షకా ॥ శ్రీ యెహోవా ॥