FaithWalk
← Back to Library

#442సమర్పణ గీతము

Author: సి. డి. శుభా DirectComposer/Ragam: యమునాకల్యాణిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
జీవితాంతము వరకు నీకే – సేవ సలుపుదు నంటిని – నీవు నాతో నుండి ధైర్యము – నిచ్చి నడుపుము రక్షకా ॥ జీవితాంతము ॥
1.
ఎన్ని యాటంకంబులున్నను – ఎన్ని భయములు గలిగిన – అన్ని పోవును నీవు నాకడ – నున్న నిజమిది రక్షకా ॥ జీవితాంతము ॥
2.
అన్ని వేళల నీవు చెంతనే – యున్న యను భవమీయవే – తిన్నగా నీ మార్గమందున – పూని నడిచెద రక్షకా ॥ జీవితాంతము ॥
3.
నేత్రములు మిరుమిట్లు గొలిపెడి – చిత్ర దృశ్యములున్నను – శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షకా ॥ జీవితాంతము ॥
4.
నాదు హృదయమునందు వెలుపట – నావరించిన శత్రులను – చెదరగొట్టుము రూపమాపుము – శీఘ్రముగా నా రక్షకా ॥ జీవితాంతము ॥
5.
మహిమలో నీవుండు చోటికి – మమ్ము జేర్చెదనంటివే – ఇహము దాటెడిదాక నిన్ను – వీడనంటిని రక్షకా ॥ జీవితాంతము ॥
6.
పాప మార్గము దరికి బోక – పాత యాశల గోరక – ఎప్పుడు నిన్నే వెంబడింపగ – కృప నొసంగుము రక్షకా ॥ జీవితాంతము ॥