#441సమర్పణము
Author: పులిపాక జగన్నాథముComposer/Ragam: సౌరాష్ట్రCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
నావన్ని యంగీకరించుమీ – దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ –
నావన్ని కృపచేత – నీ వలన నొందిన – భావంబులను నేను – బహు ధైర్యమొందెద ॥ నావన్ని ॥
1.
నీకు నా ప్రాణము – నిజముగా నర్పించి – నీకు మీదుగ గట్టి – నీ కొరకు నిల్పెద ॥ నావన్ని ॥
2.
సత్యంబు నీ ప్రేమ – చక్కగా మది బూని – నిత్యంబు గర్వముల – నీ సేవ జేసెద ॥ నావన్ని ॥
3.
నీ సేవ జరిగెడు – నీ యాలయమునకు – నా సచే నడిపించు – మరల నా పదములు ॥ నావన్ని ॥
4.
పెదవులతో నేను – బెంపుగా నీ వార్త – గదలక ప్రకటింప – గలిగించు దృఢ భక్తి ॥ నావన్ని ॥
5.
నా వెండి కనకంబు – నా తండ్రి గైకొనుమీ – యావంతయైనను – నాశింప మదిలోన ॥ నావన్ని ॥
6.
నీవు నా కొసగిన – నిర్మల బుద్ధిచే – సేవ జేయంగ నిమ్ము – స్థిర భక్తితో నీకు ॥ నావన్ని ॥
7.
చిత్తము నీ కృపా – యాయత్తంబు గావించి – మతి తప్పకుండగా – మార్గంబు దెలుపుము ॥ నావన్ని ॥
8.
హృదయంబు నీ కిత్తు – సదనంబు గావించి – పదిలంబుగా దాని – బట్టి కాపాడుము ॥ నావన్ని ॥