FaithWalk
← Back to Library

#416క్రీస్తు విశ్వాసుల కాశ్రయము

Author: పసుపులేటి దావీదుComposer/Ragam: ఖరహరప్రియCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
నాథ యేసు నాథ క్రీస్తు – నాథ – నే ననాథ సాధు జనుల బ్రోచు – సదయు నీ దయ కాదా ॥ నాథ ॥
1.
గతి దలపక మూర్ఛిత – గమనుడనై యుండగా – సతతము నన్ను గరుణించి బ్రోచెడు – గతియు నీవు కావా ॥ నాథ ॥
2.
పాపమందు జనినమైన – పామరుండనై యుండగా – దాపు జేరి వేడెద నా – ప్రాపు నీవు కావా ॥ నాథ ॥
3.
కుటిల బుద్ధిగలవాడను – క్రూరుడనై యుండగా – కటకట నన్ను గని కరుణించెడు – కరు ణ నీది కాదా ॥ నాథ ॥
4.
ఆది కర్తవు నీవు కావా – యఖిల లోకమునకును – బీదవారినెల్ల బ్రోచు – బిరుదు నీది కాదా ॥ నాథ ॥
5.
సారమైన సత్యశాస్త్ర – సారమీవు కావా – ఘోరమైన పాపి జనుల – గోరి పిలువలేదా ॥ నాథ ॥
6.
జీవనాధారమైన – త్రోవ నీవు కావా – దేవ దేవ యెహోవా నా – దిక్కు నీవు కావా ॥ నాథ ॥