#410Art thou weary, art thou languid?
Author: జాన్ మేసన్ నీల్Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
అలసట పడ్డ నీవు
దైవోక్తి విను
రా, నా యొద్ద, సువిశ్రాంతి పొందుము.
నేను చూచు గుర్తులు ఏవి,
వానికి ఉండునా?
'ప్రక్కన్ గాలుసేతులందు
గాయములు' —
రాజుబోలి కిరీటంబు
వానికి ఉండునా
'ఉండుగాని ముండ్లచేత
నల్లిరి' —
నన్ను జేర్చుకొమ్మనంగ జేర్చుకొనునా?
'అవును
లోకాంతంబు దాక
చేర్చును' —
వాని వెంబడింతు నేని యేమి లాభము?
'పాప దుఃఖ కష్టములు
వచ్చును' —
చావుమట్టు కోరుతినేని
ఏమి ఇచ్చును?
'సంతోషంబు సౌఖ్య మింక
మోక్షము' —