#404కష్టకాలమందు ఓదార్పు
Author: బేతాళ జాన్Composer/Ragam: ముఖారిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
జడియకుము నే నే యున్నానని – కడు నెనరు వాకిచ్చిన యేసుని –
యడుగు జాడలు వెంబడించి – నడుచుకొనరాదా – జీవా – ఇడుమ లధికము గలిగిన ప్రభుని – కడకున్ జేరరాదా || జడియకుము ||
1.
ఇప్పుడు నిను బాధపరచెడి – ముప్పులం దలపోసి తప్పక – గొప్ప ప్రేమార్థంపు శిక్షకు – నొప్పించుండరాదా – నీ – తప్పులన్ విడి ప్రభువు నందు – మెప్పు బొందరాదా || జడియకుము ||
2.
ఘనము ధనము సౌఖ్యంబు బోయి – వ్యసనము శోధనమున్న యోబు – మనసు దృఢము చేసి ప్రభుని – మహిమ పరచలేదా – నీ – మనసు దృఢంబటలు చేసి – మహిమ పరచరాదా || జడియకుము ||
3.
బీద లాజరుండు భువిని – బాధ నొందిన సాదృశ్యంపు – బోధన నీ మానసమున – పాదుకొనలేదా – యాతన్ – దాదరింపబడిన విధము – మోద మియ్యలేదా || జడియకుము ||
4.
మునుపు స్తెఫనును రాళ్ళతో – గొట్టుచున్న పగతుర కొరకు దేవుని – మిన్ను వైపున నిలిచి యోర్చి – మన్న నడుగలేదా – నీ – కున్న శ్రమలటు లోర్చి – ప్రభువు – నెదుర్కొనలేదా || జడియకుము ||
5.
భక్త జనులను ఖైదుకు నీడ్చి – బాధలు గావించినప్పుడు – శక్తి హీనుల మంచు యేసుని – శక్తి నమ్మలేదా – యా – యుక్త సహాయము దొరకు వరకా – శక్తి నుండలేదా || జడియకుము ||