FaithWalk
← Back to Library

#395ప్రభుని హత్తుకొనుట

Author: స. జేమ్స్Composer/Ragam: జంఝూటిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
మనవిమా మనవిమా మనసా – నీ వనుదినము యేసు సరస – ఘన ధనముల నీవు రోసి – దేవ – తనయుని కృప దలపోసి || మనవిమా ||
1.
మంకుతనములను విడిచి – నీ – భ – యంకర వేదనకు వెరచి – యింక వడి యేసు కడ కేగి – పాద – పంకజముల యొద్ద దాగి || మనవిమా ||
2.
ప్రాకటముగా నొప్పినట్టి – దైవ వాక్యము మనమున బెట్టి – శ్రీ కర నాధుని నమ్మి – ధాత్రి – నీ కలుషమ్ములను జమ్మి || మనవిమా ||
3.
సృష్టి ప్రభువు నీకు లేడ – యతని – యిష్ట – గుణగుణమ్ములు పాడ – ఇష్టముతోడను వేడి – నీదు – దుష్ట గుణముల వీడి || మనవిమా ||
4.
చెంత జేరవలదన్నాడు – కడు – వింతైన జనకుండు గాడా – చింతలు నీ కింక నేల – బహు – సంతోషమున యేసు పాల || మనవిమా ||
5.
బిరబిర వరగురు దరికి – నీ వెరుగుము దురితము బెరికి – సురుచిరమగు యేసు కరుణ – నీకు – మరణపు తరినగు నాదరణ || మనవిమా ||
6.
నిరతము నాతని మీడ – నీదు – దురితముల ననునపరాధ – త్వరితముగా నెమ్మి జూపి – దుష్ట – చరితమును వెళ్ళబాపి || మనవిమా ||
7.
అమలా పుత్రుడు నిను డాయు – నీదు – శ్రమ లన్నియు వెడల జేయు – విమలాత్మను దయచేయ – నీతి – కమలా పుత్రి మది కీయ || మనవిమా ||
8.
అంచితముగా నుతి సేయు – నిన్ ర – క్షించిన కృపా సంస్థాయు – నెంచుచు నాతని విభునిగా – కీ – ర్తించుచు బరమ గురునిగా || మనవిమా ||